(ది జర్నలిస్ట్, న్యూ ఢిల్లీ ప్రతినిధి)
లోక్సభ ఎన్నికల తొలి విడత పోలింగ్ కు బుధవారం నోటిఫికేషన్ విడుదలయింది. తొలి విడతలో 21 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో 102 లోక్సభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. బుధవారం నోటిఫికేషన్ జారీతో ఈ నియోజకవర్గాల్లో నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమయింది. నామినేషన్లు దాఖలు చేసేందుకు ఈ నెల 27 చివరి తేదీ.. కాగా నామినేషన్ల పరిశీలన 28వ తేదీ.. నామినేషన్ల ఉపసంహకరణకు 30 చివరి తేదీ. తొలి విడత పోలింగ్ ఏప్రిల్ 19.. ఓట్ల లెక్కింపు జూన్ 4న జరుగుతుంది.
తొలి దశ పోలింగ్ లో అత్యధికంగా తమిళనాడులో 39 స్థానాలకూ ఒకే విడతలో పోలింగ్ నిర్వహిస్తారు..
తమిళనాడులో 39 స్థానాలు, రాజస్థాన్లో 12, ఉత్తరప్రదేశ్ లో 8, మధ్యప్రదేశ్ లో 6, అసోం, మహారాష్ట్ర, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో ఐదేసి స్థానాలు, బీహార్లో 4, పశ్చిమ బెంగాల్లో 3, మణిపూర్, అరుణాచల్ ప్రదేశ్, మేఘాలయ రాష్ట్రాల్లో రెండేసీ స్థానాలు, ఛత్తీస్ గడ్, మిజోరం, నాగాలాండ్, సిక్కిం, త్రిపుర, అండమాన్ నికోబార్, జమ్ముకశ్మీర్, లక్షద్వీప్, పుదుచ్చేరిల్లో ఒక్కో స్థానానికి ఏప్రిల్ 19న పోలింగ్ జరుగుతుంది..