ఉత్సాహంగా శ్రీవివేకానంద వార్షికోత్సవ వేడుకలు

కాకినాడ, ది జర్నలిస్ట్ ప్రతినిధి :

శ్రీవివేకానంద విద్యాసంస్థల వార్షికోత్సవ వేడుకలు ఆదివారం ఉత్సాహభరితంగా జరిగాయి. స్థానిక దంటు కళాక్షేత్రంలో శ్రీవివేకానంద స్కూల్‌ ఇంద్రపాలెం బ్రాంచ్‌ 32వ, మధురానగర్‌ బ్రాంచ్‌ 21వ వార్షికోత్సవ వేడుకల్ని, కెజి విద్యార్ధులకు స్నాతకోత్సవ వేడుకల్ని ఘనంగా నిర్వహించారు. స్కూల్‌ కరస్పాండెంట్‌ బిఎఎస్‌ సరోజిని జ్యోతిప్రజ్వలన చేసి వేడుకల్ని ప్రారంభించగా చార్టెట్‌ అకౌంటెంట్‌ డిపిఆర్‌ స్వామి, విఎస్‌ఎమ్‌ కళాశాల రిటైర్డ్‌ ప్రిన్సిపాల్‌ పి వెంకటేశ్వర్లు ముఖ్యఅతిధులుగా పాల్గొన్నారు. ముందుగా సరోజిని మాట్లాడుతూ వివేకానంద స్కూల్స్‌ విజ్ఞాన భాండాగారాలుగా విరాజిల్లుతున్నాయన్నారు. మూడు దశాబ్ధాల తమ ప్రయాణంలో ఎన్నో విజయాలు సాధించామన్నారు. తమ విద్యార్ధుల్ని అన్నిరంగాల్లో తీర్చిదిద్దుతున్నామన్నారు. కేవలం పాఠ్యాంశాలపైనే కాకుండా సామజిక సేవా, పర్యావరణ పరిరక్షణ వంటి అంశాల్లోనూ వారి ని భాగస్తుల్ని చేస్తున్నామన్నారు. ప్రతి ఏటా 10వ తరగతిలో నూరు శాతం ఉత్తీర్ణత సాధిస్తున్నామన్నారు. ఈ ఏడాది నుంచి ఎన్‌సిఇఆర్‌టి సిలబస్‌కనుగుణంగా ఒలింపియాడ్‌, నీట్‌ కోర్సుల్ని తమ విద్యార్ధులకు అందుబాటులోకి తీసుకొస్తున్నామన్నారు. ఈ కోర్సులో శిక్షణిచ్చేందుకు హైదరాబాద్‌కు చెందిన ఓ సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు చెప్పారు. ఇందుకోసం విద్యార్ధుల తల్లిదండ్రులపై ఎటువంటి భారం లేకుండా స్కూల్‌ ఫీజులోనే ఈ కోర్సుల్ని అందిస్తామన్నారు. గతేడాది రామచంద్రపురంలో ప్రారంభించిన తమ స్కూల్‌కు 10వ తరగతి వరకు అనుమతులొచ్చాయన్నారు. తల్లిదండ్రులందిస్తున్న ప్రోత్సాహంతోనే తాము మరింత ముందుకెళప్తన్నామన్నారు. ముఖ్యఅతిధులు డిపిఆర్‌ స్వామి, పి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ శాస్త్రవేత్తలుగా రాణించిన నాడే బంగారు భవిష్యత్‌ ఉంటుందని, ఇందుకోసం విద్యార్దులు వినూత్న ఆలోచనలు చేయాలంటూ సూచించారు. విద్యార్దులు తమ కలల్ని సాకారం చేసుకునేందుకు వివేకానంద స్కూల్స్‌ వేదికగా నిలుస్తున్నాయన్నారు. స్కూల్‌ యాజమాన్యం అందుబాటులోకి తెస్తున్న నూతన కోర్సుల్ని సద్వినియోగం చేసుకుంటూ విద్యార్ధులు ఉన్నత శిఖరాల్ని అధిరోహించాలని ఆకాంక్షించారు. అనంతరం వివిధ విభాగాల్లో ్తఅత్యుత్తమ ప్రతిభ చూపినవిద్యార్దులకు ముఖ్యఅతిధుల చేతుల విూదుగా బహుమతుల్ని, కెజి విద్యార్ధులకు పట్టాలను ప్రధానం చేశారు. ఈ సందర్భంగా విద్యార్దులు నిర్వహించిన సాంస్కృతిక ప్రదర్శనల ప ఆహుతుల్ని అలరించాయి. కార్యక్రమంలో శ్రీవివేకానంద చైర్మన్‌ సిహెచ్‌ వెంకటేశ్వరరావు, డైరెక్టర్‌ శైలుష, అకడమిక్‌ డీన్‌ సిహెచ్‌ వికాష, స్కూల్‌ అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బంది, విద్యార్ధులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు.