పవన్ కళ్యాణ్ పై మావోయిస్టుల మండిపాటు
ఎన్నికల నేపథ్యంలో రాజకీయ పార్టీలను ఉద్దేశించి మావోయిస్టులు లేఖ రాశారు. మావోయిస్టు పార్టీ కీలక నేత గణేష్ పేరిట విడుదలైన ఈ లేఖలో పలు రాజకీయ పార్టీలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను తూర్ఫార్బట్టారు.అలాగే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాజకీయ నిబద్ధతను, విశ్వసనీతను ప్రశ్నించారు.పార్టీ ప్రారంభించిన సమయంలో తనవి వామపక్ష భావాలు అంటూ ప్రకటించిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు బిజెపి వంటి మతతత్వ పార్టీలతో కలసి ఎన్నికలకు వెళ్ళడాన్ని ఏ విధంగా సమర్థించుకుంటారంటూ ప్రశ్నించారు. ఒక స్పష్టమైన రాజకీయ విధానం మీకు లేదా అని నిలదీశారు.