విశాఖపట్నం:
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మరో మూవీ స్టార్ట్ చేశాడు. ఆర్ఆర్ఆర్ మూవీ తర్వాత పాన్ ఇండియా స్టార్‌గా మారిన రామ్ చరణ్ భారీ బడ్జెట్ సినిమాలతో దూసుకుపోతున్నాడు.డైరెక్టర్ శంకర్‌తో సినిమా చేస్తూనే మరో మూవీని అనౌన్స్ చేశాడు. ఉప్పెన డైరెక్టర్ బుచ్చిబాబుతో కలిసి ఓ భారీ ప్రాజెక్ట్ చేయనున్నాడు. ఇందులో అందాల తార శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తోంది. తాజాగా నేడు ఈ మూవీ ఓపెనింగ్ గ్రాండ్‌గా జరిగింది. మెగాస్టార్ చిరంజీవి చీఫ్ గెస్ట్‌గా వచ్చి చరణ్ కొత్త సినిమాకు కొబ్బరికాయ కొట్టాడు.రామ్ చరణ్, జాన్వీ కపూర్ నటిస్తున్న ఈ మూవీకి ప్రళయం అనే టైటిల్‌ను అనుకుంటున్నారు. ఉప్పెన మూవీ సముద్రం చుట్టూ జరుగుతుంది. రామ్ చరణ్ కొత్త మూవీ కూడా సముద్రం చుట్టూ జరగడంతో ఇదే టైటిల్ ఖరారు చేసే పనిలో మేకర్స్ ఉన్నారు. ఈ మూవీకి ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. అప్పట్లో జగదేకవీరుడు అతిలోకసుందరి సినిమాలో చిరంజీవితో శ్రీదేవి ఆడిపాడింది. ఇప్పుడు కొత్త జనరేషన్‌లో రామ్ చరణ్, జాన్వీ కపూర్‌లు తెలుగు ప్రేక్షకులను అలరించేందుకు వచ్చేస్తున్నారు. పాన్ ఇండియా రేంజ్‌లో ‘ప్రళయం’ మూవీ విడుదల కానుంది. ఈ మూవీకి టైటిల్ పక్కాగా వర్కౌట్ అయ్యే అవకాశం ఉందని సినీ లవర్స్ చెబుతున్నారు. మొత్తానికి అప్పుడు ఉప్పెనతో వచ్చిన బుచ్చిబాబు ఇప్పుడు ప్రళయం అంటున్నాడు. ఇక మరో సినిమాను సునామీ అంటాడేమోనని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఈ మూవీలో రామ్ చరణ్ కొత్త లుక్‌తో పాటు ఉత్తరాంధ్ర భాషతో అదరగొట్టనున్నాడట. ఈ విషయం తెలిసి చెర్రీ ఫ్యాన్స్ గెంతులేస్తున్నారు.