thejournalist
కాకినాడ, ది జర్నలిస్ట్ ప్రతినిధి :
కాకినాడ రూరల్ నియోజకవర్గంలో స్వతంత్ర సమరయోధుడు అల్లూరి సీతారామరాజుకి అవమానం జరిగింది. ఎన్నికల కోడ్ పేరిట ఈ నియోజకవర్గ పరిధిలోని తూరంగి బొడ్డు చెరువు వద్ద గట్టుపైనున్న అల్లూరి విగ్రహానికి ముసుగు అధికారులు ముసుగు వేశారు. దీంతో స్థానికులతో కలసి సబ్బతి ఫణేశ్వరరావు, రామలక్ష్మి ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అల్లూరి ఏ పార్టీకి చెందిన వ్యక్తి కాదని.. అతనొక స్వాతంత్రోద్యమకారుడన్నారు. అధికారుల చర్య మన్యం వీరుడ్ని అవమానించడమేనన్నారు. తక్షణమే అల్లూరి విగ్రహానికి వేసిన ముసుగు తొలగించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నూకరాజు తదితరులు పాల్గొన్నారు.
nalist